మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాం మత్స్యకార గ్రామంలో ఆయన పర్యటించారు. మత్స్య సాగరమాల పేరుతో కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను తాను గుర్తించానని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మచ్చ సాగరమాల కార్యక్రమం ద్వారా అన్ని మత్స్య కార్యక్రమాల్లో సోలార్ విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో మొదటి విడతగా 1400 సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశామని, రెండవ విడతలో మరో 16 సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల మొదటి రోజే పెన్షన్లు అందిస్తుండటంతో వృద్ధులు వికలాంగులు వితంతువుల జీవితాల్లో ప్రతిరోజు పండగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *