గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపు నిచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లిన యార్లగడ్డ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. గన్నవరం నియోజకవర్గంలో ‘సర్’ కార్యక్రమం విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందేలా చూడటంతోపాటు, ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలకు అందించే వరకు ఫాలోఅప్ చేయాలన్నారు. ఎన్యూమరేషన్ అధికారులు, బిఎల్ఓలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వారి సూచనలను పాటిస్తూ అర్హుల ఓట్లు తొలగించకుండా తగు జాగ్రత్త వహించటంతోపాటు మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించేలా చూడాలని కూటమి శ్రేణులను యార్లగడ్డ కోరారు. 18 ఏళ్ళు నిండిన వారిని ఓటరుగా చేర్పించాలని, నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News