Breaking News

తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. రేపు(సోమవారం) ఉదయం/మధ్యాహ్నంలోపు పారాదీప్ – సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55-65 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయన్నారు. ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలు ఉపయోగించడం సురక్షితం కాదని సూచించారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *