Breaking News

త్వరలో ఆప్కో ఎన్నికలు

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-చేనేత సహకార సంఘ ఎన్నికలు జరుపుతాం
-అర్హులందరికీ నేతన్న సేవలో…ఆర్థిక సాయం
-నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన
-ప్రగడ కోటయ్య స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధి
-చేనేతలకు ఎప్పుడూ సీఎం చంద్రబాబు పాలన స్వర్ణయుగమే
-చేనేతలను మోసగించిన జగన్
-వైసీపీ కార్యకర్తలకు నేతన్న నేస్తం నిధులు : మంత్రి సవిత మండిపాటు
-చీరాలలో ఘనంగా ప్రగడ కోటయ్య రాష్ట్ర జయంతి వేడుకలు
-ప్రగడ కోటయ్య కుటుంబీకులకు ఘన సత్కారం

చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో చేనేత సహకార సంఘాలతో పాటు ఆప్కో ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవలో పథకం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. నేతన్నల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు పాలన ఎప్పుడూ చేనేతలకు స్వర్ణయుగమేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనర్హులకు కూడా నేతన్న నేస్తం పేరుతో ఆర్థిక సాయమందించిందని విమర్శించారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ… ఆయన చేనేత రంగానికి చేసిన సేవలను భావితరాలకు తెలియజేస్తోందన్నారు. చీరాలలోని పద్మశాలీ కల్యాణ మండపంలో ప్రగడ కోటయ్య రాష్ట్ర స్థాయి జయంతి వేడుకులను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్దికి ప్రజాబంధు ప్రగడ కోటయ్య చేసిన సేవలు మంత్రి సవిత గుర్తు చేశారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ప్రగడ కోటయ్య తుది శ్వాస విడిచేవరకూ పోరాడారన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యునిగా చట్టసభల్లో చేనేతల వాణిని వినిపించారన్నారు. నాలుగు చేనేత సత్యాగ్రహాలను నిర్వహించిన పోరాట యోధుడని కొనియాడారు. ఆనాటి ప్రధాని జవహర్ నెహ్రూతో చీరాల స్పిన్నింగ్ మిల్లుకు శంకుస్థాపన చేయించారన్నారు. ప్రగడ కోటయ్య స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారననారు. ప్రజాబంధు కోటయ్య సేవలను భావి తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన జయంతిని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. చీరాలలో ప్రగడ కోటయ్య రాష్ట్రస్థాయి జయంతిని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. చేనేతల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కోటయ్య జయంతిని కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి సవిత తెలిపారు.

త్వరలో ఆప్కో సహా చేనేత సహకార సంఘాల ఎన్నికలు

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్ని మంత్రి సవిత తెలిపారు. చేనేత సహకార సంఘాల బలోపేతంపై ఆయన దృష్టి సారించారన్నారు. త్వరలోనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. తరవాత ఆప్కో ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చేనేత సహకార సంఘాలు బలోపేతమైతే నేతన్నలకు, కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాల బకాయిలను సైతం చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు. రానున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు కూడా చీరాలలోనే నిర్వహించే అవకాశముందని వెల్లడించారు. అమరావతిలో రూ.10 కోట్లతో ప్రగడ కోటయ్య స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

అర్హులందరికీ ‘నేతన్న సేవలో…’

చేనేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచని అని మంత్రి సవిత తెలిపారు. ఒకవైపు చేనేత రంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూనే, వ్యక్తిగతంగా నేతన్నలకు ఆర్థిక చేయూతనివ్వాలన్నది ఆయన సంకల్పమన్నారు. దీనిలో భాగంగానే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. చేనేతలకు పెన్షన్లు అమలుచేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మగం నేసే నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. వాటితో ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ఏటా రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేసే నేతన్న సేవలో…పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వచ్చే నెల ఏడో తేదీన జాయతీ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అర్హులైన నేతన్నలందరికీ వయస్సు సంబంధం లేకుండా నేతన్న సేవలో పథకాన్ని వర్తింప జేస్తామన్నారు.

చేనేతలకు జగన్ మోసం

ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్… చేేనేతలకు తీవ్రంగా మోసగించారని మంత్రి సవిత మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ఇష్టారాజ్యంగా అమలుచేసిందని విమర్శించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేసి, కేవలం నేతన్న నేస్తం పథకం మాత్రమే అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద అర్హులతో పాటు వైసీపీకి చెందిన ఫేక్ చేనేతలకు కూడా నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సాయంతో పాటు పెన్షన్లు అందించిందన్నారు. సీఎంచంద్రబాబునాయుడు ఎప్పుడు కూడా చేనేతలకు స్వర్ణయుగమేనన్నారు. 2014-19లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతలకు మేలు చేసేలా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత చేనేతలకు చేయూతగా నిలుస్తున్నామని తెలిపారు.

ప్రగడ కోటయ్య కుటుంబీలకు ఘన సత్కారం

అంతకుముందు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా, ప్రజాబంధు ప్రగడ కోటయ్య విగ్రహానికి మంత్రి సవిత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రగడ కోటయ్య తనయుడు వెంకటశేషసయిన,కోడలు పద్మావతి, కుమార్తెను, అల్లుడిని, ఇతర కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. మంత్రి సవితను స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, చిలకలపూడి పాపారావు, పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జి.ధనుంజయరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నేతన్నలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *