-33% మహిళా రిజర్వేషన్ లో బిసి మహిళలకు సబ్ కోటా కేటాయించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ లో బిసి మహిళలకు సబ్ కోట కేటాయించాలి అని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ గార్లకు రిపజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మిశని మర్యాదపూర్వకంగా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు మేక వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకారావు, బీసీ ఎంప్లాయిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరీదు రాంబాబు, కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు వాకా వెంకటేశ్వరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహంతి వాసు, బీసీ సంక్షేమ సంఘం సోషల్ మీడియా తెన్నేటి ప్రకాష్ మరియు పలు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News