-సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తు కోసం పాటుపడుతున్న భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సేవలు అభినందనీయమని ప్రముఖ సామాజిక సేవకులు, సీ బి ఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సీ బీ ఆర్ ప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు.
సోమవారం భవానిపురం, ఆర్ టి సి వర్క్ షాప్ రోడ్డు లోని భవిత్ స్పెషల్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రాన్ని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జాగృత భారత ఎన్ జీ ఓ ఫౌండర్ పసుపులేటి గణేష్ తో కలిసి సందర్శించారు.
ప్రత్యేక అవసరాల విద్యార్థులతో మమేకమై ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. చిన్నారులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.. చిన్నారులకు అందిస్తున్న ఫిజియోథెరపీ స్పీచ్, ఆక్యుపేషన్ థెరపీ వంటి సేవల గురించి భవిత్ ప్రిన్సిపల్ సునీతతో మాట్లాడారు. చిన్నారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తును మెరుగుపరిచే బాధ్యతను భవిత్ నీడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకోవడం అభినందనీయన్నారు. అందరం సమన్వయంతో పని చేస్తే ఈ చిన్నారులు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సామాజిక సేవకులు సీ బీ ఆర్ ప్రసాద్ ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News