Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్

-బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోందని బీజేపీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి అన్నారు.

సోమవారం, భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో బీ జే పీ స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజా దర్బార్ల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బీజేపీ నేషనల్ మీడియా ప్యానలిస్ట్ , స్పోక్ పర్సన్ కనుమూరు రవిచంద్ర రెడ్డి తెలిపారు. సుజనా న్యాయ మిత్రా బాయన హేరంబ కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాదర్ల శివ, బొల్లేపల్లి కోటేశ్వరరావు, పల్లంటి అది తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *