Breaking News

ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను తెలిపారు. ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వైద్య సహాయం , స్థానిక సమస్యలపై ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తులు అందజేశారు. వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు తీసుకుంటున్నారని మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, అత్తులూరి ఆదిలక్ష్మీ పెదబాబు, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు తెలిపారు. కూటమి నేతలు దేవిన హరి ప్రసాద్, ఈగల సాంబశివరావు, గడ్డం సాంబశివరావు, ప్రభు చరణ్, దాడి మురళి కృష్ణ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *