విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 51 వ డివిజన్ , కు చెందిన గొల్లపల్లి సామ్యూల్ (65) హృద్రోగం తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 95 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 52 వ డివిజన్, బ్రాహ్మణ వీధికి చెందిన మామిడి శివ (39) హెర్నియా తో బాధపడుతూ శస్త్రచికిత్స కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 31 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. అదేవిధంగా 52 వ డివిజన్ కొత్తపేటకు చెందిన రిక్కా తాతారావు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కొరకు వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 2 లక్షల 47 వేల విలువైన ఎల్ ఓ సీ ను కూటమి నేతలతో కలిసి అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, కూటమి నేతలు బాదర్ల శివ, శనివారపు శివ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News