విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు, రాజీవ్ నగర్, పాయకాపురం, లెనిన్ సెంటర్ ప్రాంతాల్లోని షిరిడి సాయిబాబా దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గురుపౌర్ణమి గురువులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన పర్వదినమని, షిరిడి సాయిబాబా బోధించిన సేవా భావం, మానవత్వం, సమానత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. అన్నదానం మహాదానమని, భక్తులకు ప్రేమతో, భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదం అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, విజయవాడ నగరం, సెంట్రల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News