Breaking News

జూలై 30 న విజయవాడలో రెవెన్యూ భవన్ లో ఉదయం 10:30 గంటలకు ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

-సమావేశం అనంతరం మూడవ దశ ఆందోళన కార్యక్రమాల ప్రకటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూలై 30 న ఉదయం 10:30 గంటలకు విజయవాడ రెవెన్యూ భవన్‌లో నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంపై సమీక్ష నిర్వహించి, ఆర్టీసీలో ప్రవేటు విధ్యుత్ బస్సుల ప్రవేశం వలన ఆర్టీసికి రాబోతున్న పెను ప్రమాదంపైన, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం చేపట్టనున్న మూడవ దశ ఆందోళన కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించామని ఆర్టీసి జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు బుదవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

జూలై 30 న ఆర్టీసి హౌస్ లో జేఏసి నాయకులతో విసి& యం.డి చర్చలు
జూన్ 11 న ఆర్టీసి ఉద్యోగ సంఘాలు జెఏసి గా ఇచ్చిన మెమోరాండపై జూలై 30 గురువారం సాయంత్రం 4:00 గంటలకు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో వీసీ & ఎండీ గారు,ఇతర ఆర్టీసి ఉన్న తాధికార్ల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సమావేశానికి ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగసంఘాల జేఏసీ ప్రతినిధులను సమావేశానికి రమ్మని లేఖ పంపారని ఈసమావేశాని ఆర్టీసి జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు ఆద్వర్యంలో హాజరౌతున్నామని ఆర్టీసి జేఏసి కో-.కన్వీనర్లు పి.వి.రమణారెడ్డి,జి.వి.నరసయ్య,సి.హెచ్ .సుందరయ్య,కట్టాసుభ్రమణ్యం,యస్.వి.శేషగిరిరావు,వై.శ్రీనివాసరావు,కే.సూర్యప్రకాశరావు,డి.మాల్యాధ్రీ లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *