విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ భూమి మానవులకే సొంతం కాదని, అన్ని రకాల జీవరాశుల ఉమ్మడి నివాసంగా మనం గుర్తించి జంతువులను కాపాడడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో పాలుపంచుకోవాలని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ కె. బాలాజి అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం, రసాయనశాస్త్ర విభాగం సంయుక్తంగా ఈరోజు అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం జరిపాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న అటవీ శాఖ ఉన్నతాధికారి బాలాజీ మాట్లాడుతూ పులుల సంరక్షణ విషయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పులుల సంతతి పెంచడానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా బాలాజీని కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా.పి శ్రీనివాసరావు, జంతుశాస్త్ర అధ్యాపకులు డి. శ్రావణి, జి.రాజేశ్వరి ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News