‘రేపు ఇంద్రకీలాద్రి పై ప్రోటోకాల్/విఐపి దర్శనాలు నిలిపివేత ‘

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాఢ మాసం ఉత్సవాలు సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి సారె సమర్పణకు భక్తులు వస్తున్నట్లు దేవస్థానంకు సమాచారం అందించడం,గత ఆదివారములలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దేవాలయం లో రద్దీ వాతావరణం నెలకొన్న పరిస్థితి రీత్యా రేపు ఇంద్రకీలాద్రి పై ఉదయం 8నుండి మధ్యాహ్నం 3వరకు ప్రోటోకాల్/విఐపి దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వికె శీనా నాయక్ ప్రకటించారు. అదే విధంగా రేపు ఘాట్ రోడ్ వైపు ప్రవేట్ వాహనాల రాకపోకలు నియంత్రిస్తామని, దేవస్థానం బస్సులు పూర్తి స్థాయిలో నడుపుతామని, లిఫ్ట్ మార్గం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని, మహా మండపం ర్యాంప్ మీదుగా భక్తులు కొండపైకి చేరుకోవాలని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు రద్దీ లేని సమయమైన ఉదయం 8 లోపు, సాయంత్రం 3 నుండి 5 లోపు రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంతో సహకరించాలని ఈవో శీనా నాయక్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *