ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల నిర్వహణకు 103 పరీక్షా కేంద్రాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET-JUNE-2026) పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు 05.06.2026 నుండి 05.07.2026 వరకు స్వీకరించబడినవి. మొత్తం 2,14,486మంది అభ్యర్థులు 2,38,252దరఖాస్తులు సమర్పించారు. వీటిలో 74,711మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 84,798దరఖాస్తులు సమర్పించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, APTET-JUNE-2026 పరీక్షలు 05.08.2026 నుండి 16.08.2026 వరకు 11 రోజులపాటు, 22 సెషన్లలో, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించబడనున్నాయి.

ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 91 పరీక్షా కేంద్రాలు, పొరుగు రాష్ట్రాలలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. వాటిలో తెలంగాణలో 4, తమిళనాడులోని చెన్నైలో 3, కర్ణాటకలో 2, ఒడిశాలోని బరంపురంలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి..
పరీక్షా సమయాలు:
• మొదటి సెషన్:ఉదయం9.30 గంటల నుండి 12.00 గంటల వరకు
• రెండవ సెషన్:మధ్యాహ్నం2.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు
APTET-JUNE-2026హాల్ టికెట్లు ఇప్పటికీ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లలో అందుబాటులో ఉంచబడినవి. ఇప్పటివరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవలసిందిగా సూచించడమైనది.
అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రంలో హాజరు కావలసి ఉంటుంది.అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక గంట ముందుగానే తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రానికి చేరుకోవలసిందిగా సూచించడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *