Breaking News

అమరావతిలో వరుసగా రెండో రోజు కొనసాగిన ప్రపంచ బ్యాంక్ & ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందం సమావేశాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు రోజుల అమరావతి పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం రెండో రోజు మంగళవారం, 2026 ఆగస్టు 4న రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహించింది.

మంగళవారం ఉదయం APCRDAలోని వివిధ విభాగాల ముఖ్య అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి, రాజధాని అమరావతి నగర పరిధిలో సామాజిక, పర్యావరణ అంశాలకు సంబంధించి, రహదారి భద్రతా నియమాలు, భద్రతా ప్రమాణాల అమలు గురించి చర్చించింది. సమావేశంలో APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ డైరెక్టర్ వెలుగోటి రాములు, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) కె.ఎస్.భాగ్యరేఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం రాజధాని అమరావతి నగర నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన భూసమీకరణ, భూసేకరణ కార్యకలాపాలపై WB & ADB బృందం పలు సూచనలు చేసింది. అలాగే భూసేకరణలో భాగంగా రాజధాని గ్రామాలలో అమలు కాబడిన కార్యాచరణపై చర్చించింది. రాజధాని గ్రామాల రైతులు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి APCRDA అమలు చేస్తున్న గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(GRM)పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించింది. 2027 ఏడాదికి సంబంధించి ప్రాజక్టులో భాగంగా నిధుల విడుదలకు సైతం సిద్ధం కాబడుతున్న ప్రణాళికలు, AGICL ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, రాజధానిలో ప్రతిపాదించిన PPP ప్రాజెక్టుల స్థితిగతులను గురించి WB & ADB బృందం సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది. అమరావతిలో ADCL ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ బఫర్ జోన్లు, పార్కుల గురించి..ఆయా ప్రాజెక్టుల ప్రణాళికల గురించి పలు సూచనలు చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *