Breaking News

డీఎస్సీపై వైసీపీ పిల్‌ను హైకోర్టు తిరస్కరించడాన్ని స్వాగతించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

-డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం
-మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదు
-10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం
-కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్నివేళలా అండగా నిలబడుతుంది

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి వైసీపీ నేతలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తిరస్కరించడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించిందని ఆయన మండిపడ్డారు.

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వినియోగించడం వైసీపీ రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులా నిలిచిందని అన్నారు. డీఎస్సీ అభ్యర్థుల పేరుతో వైసీపీ చేస్తున్న కుట్రలను న్యాయస్థానం భగ్నం చేయడాన్ని స్వాగతించాలన్నారు.

నిరుద్యోగులకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నియామకాల ప్రక్రియను చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అర్థరహితమైనవని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది ఫలితాలను విడుదల చేశామని మంత్రి వెల్లడించారు.

ఐదేళ్ల పాలనలో మెగా డీఎస్సీ నిర్వహించని వైసీపీకి ఈ అంశంపై మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న చరిత్ర వైసీపీదేనని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.

యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల కోసం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నామని మంత్రి వెల్లడించారు. 16 వేల మంది ఉపాధ్యాయుల కష్టాన్ని అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎస్సీ నిర్వహణపై ఏవైనా సందేహాలు ఉంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. మెగా డీఎస్సీ విజయాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కోర్టు కేసుల ద్వారా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించింది వైసీపీ కాదా అని మంత్రి ప్రశ్నించారు.

ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి యువతను మోసం చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదన్నారు. యువత భావోద్వేగాలతో ఆడుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని, యువత భవిష్యత్తు కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలతో యువతను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని, కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *