నగరంలో ఘనంగా ఉప్పులూరి మల్లికార్జునశర్మ 88వ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో జానకి మల్లికార్జున ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధేయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ, సాంస్కృతిక మండలి పూర్వ అధ్యక్షుడు డా.ఉప్పులూరి మల్లికార్జునశర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక సంగీతంలో విశేష కృషి చేస్తున్న పప్పు సదాశివ శాస్త్రికి ‘ఉప్పులూరి మల్లికార్జునశర్మ స్మారక పురస్కారం-2026’ అందజేశారు. వక్తలు మాట్లాడుతూ మల్లికార్జున శర్మ చిన్నవయస్సులోనే జాతీయ ఉద్యమ వైపు మొగ్గు చూపారన్నారు. మధ్య విమోచన, గాంధీ శాంతి, అహింస కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్ తరాల వారికి ఉప్పులూరి మల్లికార్జునశర్మ ఒక ఆదర్శం అని కొనియాడారు. వ్యవస్థాపక ట్రస్టీ, హైకోర్ట్ న్యాయవాది ఉప్పులూరి శ్రీనివాసశర్మ మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరఫున మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి పురస్కారాలు అందజేసి కళాకారులను గౌరవించే దిశగా ప్రోత్సహిస్తామన్నారు. అంతేకాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రస్ట్ తరఫున భవిష్యత్‌లో అందుబాటులో నూతన కార్యాలయాన్ని తీసుకువస్తామన్నారు. సత్యనాట్య అకాడమీ గురువు కందుకూరి సత్యవతి శిష్యులు పులి శీతల్, బత్తుల మధులాలస భరతనాట్య ప్రదర్శన, దేశభక్తి గీతాలాపనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పురస్కారగ్రహీత పప్పు సదాశివ శాస్త్రి అన్నమాచార్య కీర్తనలు ఆలపించి సంగీత ప్రియులను అలరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉప్పులూరి లక్ష్మీనారాయణ, గోళ్ళ నారాయణరావు, బోడె ఆంజనేయరాజు, కే.సుబ్బరామయ్య, రాంపిళ్ల జయ ప్రకాశ్, డోగిపర్తి శంకరరావు, చట్లపల్లి మారుతీ ప్రసన్న, సాహితీవేత్త ఉప్పులూరి మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *