-ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో చర్చిస్తాం.
-వయోపరిమితి 62 సం.కు పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తాం.
-ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషిచేస్తానని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తానని ఎపి జేఎసి చైర్మన్ ఎ.విద్యాసాగర్ తెలిపారు.
ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీవో హోమ్‌లో జరిగింది. సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఎన్ జి జి ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి వి రమణ, ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మర్యాద పూర్వకంగా కలిసీ ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన అనంతరం అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలన్న డిమాండ్ సహా ఉద్యోగుల ప్రధాన సమస్యలన్నింటినీ ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల డిమాండ్లపై జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రభుత్వం ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకునేలా మా వంతు ప్రయత్నం చేస్తామని అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు.
అలాగే, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా ఎపి జేఏసి అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో పిఆర్సి చైర్మన్ నియామకం ఐ ఆర్ మంజూరు డి ఏ బకాయులు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపు టీచర్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి విషయాల పై ప్రభుత్వం నుండి సానుకూల స్పందన ఉంటుందని ఆశాభావం తో ఉన్నామని లేని పక్షం లో తదుపరి కార్యాచరణ కు జే ఏ సి నాయకులు సిద్ధంగా ఉన్నారని విద్యాసాగర్ తెలిపారు.
కార్యక్రమంలో గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాణ్యం వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగభూషణం, రత్నం, వెంకటేశ్వరరావు, సంతోష్, హైమావతి, కళ్యాణి, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News