Breaking News

గుంటూరు లో “అమరావతి చిత్రకళా వీధి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నఅతిపెద్ద కళా ఉత్సవం “అమరావతి చిత్రకళా వీధి” (Andhra’s Most Vibrant Art Festival) కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, జిఎంసి అధికారులతో కలిసి కార్యక్రమ వేదికల ప్రాంతమైన గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ వరకు పరిశీలించి, సందర్శకులకు, కళాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి చిత్రకళా వీధి ఉత్సవాలు జరిగే గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ వరకు రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే మరమ్మతులు చేయాలని, సందర్శకుల ప్రాథమిక సౌకర్యాల కోసం మార్గమధ్యంలో 4 ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచాలని, వచ్చే ప్రజలందరికీ సురక్షితమైన ఉచిత మంచినీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలని ఎంహెచ్ఓకి సూచించారు. రాకపోకలకు ఆటంకంగా మారే ఆక్రమణలను, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే సదరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, రాకపోకలు సజావుగా సాగేందుకు పోలీసు, ట్రాఫిక్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, బయాలజిస్ట్ శేషయ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *