Breaking News

పరిశ్రమలకు ప్రోత్సాహం… మహిళలకు సాధికారత… ఇదే కేంద్రం కార్యాచరణ!

-“చిన్ని ప్రశ్న… కేంద్రం సమగ్ర సమాధానం!”
-“మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్రం భారీ చేయూత…
-“6.66 లక్షల మందికి నైపుణ్య శిక్షణ”
-“ఏపీలో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం…”
-“కృష్ణా జిల్లాలో కీలక క్లస్టర్ ప్రాజెక్టుల పురోగతిపై పూర్తి వివరాల వెల్లడి”
-“లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం”

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలను పార్లమెంట్ వేదికగా నిరంతరం ప్రస్తావిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) మరో కీలక అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. Micro & Small Enterprises–Cluster Development Programme (MSE-CDP) అమలుపై ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమగ్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ ప్రాజెక్టుల అమలు నుంచి మహిళా పారిశ్రామికవేత్తల శిక్షణ వరకు పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరాలను సభ ముందుంచింది.

చిన్ని ప్రశ్నల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో MSE-CDP కింద ఆమోదించిన క్లస్టర్ ప్రాజెక్టులు, వాటికి కేటాయించిన నిధులు, విడుదల చేసిన గ్రాంట్లు, వినియోగం, పనుల పురోగతి, మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార చర్యలు వంటి కీలక అంశాలు ఉన్నాయి. దీనిపై కేంద్రం పూర్తి వివరాలను సభకు అందించింది.

“మహిళా సాధికారతకు కేంద్రం పెద్దపీట!”

ఈ సమాధానంలో ప్రత్యేకంగా నిలిచిన అంశం మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహం. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో 42,211 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వాటి ద్వారా 19,54,701 మందికి శిక్షణ అందించగా, వారిలో 6,66,327 మంది మహిళలు ఉన్నారు. వస్త్ర పరిశ్రమతో పాటు పలు రంగాల్లో మహిళలు స్వయం ఉపాధి క్లస్టర్లు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు, పారిశ్రామిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.

“ఏపీకి క్లస్టర్ బూస్ట్… కృష్ణా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు”

ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయిన, కొనసాగుతున్న కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCలు), ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల వివరాలను కేంద్రం వెల్లడించింది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్, విజయవాడ గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్, జగ్గయ్యపేట గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్ పూర్తయినట్లు పేర్కొంది. అలాగే మచిలీపట్నం జ్యువెలరీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్‌గ్రేడేషన్, గన్నవరం వీరపనేనిగూడెం న్యూ ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఫేజ్-III) వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

“సమన్వయంతోనే” వేగంగా అమలు!

పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు, అమలు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఆమోదించిన ప్రాజెక్టులు నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా పర్యవేక్షణ కొనసాగుతోందని మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

“మహిళల చేతిలో నైపుణ్యం… దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం.”

చిన్ని ప్రశ్న… కేంద్రం సమగ్ర లెక్కలు!

MSE-CDPపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)
సమాధానం ఇచ్చిన కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే

42,211 నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు

19,54,701 మందికి శిక్షణ

6,66,327 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ

ఏపీలో పూర్తయిన, కొనసాగుతున్న క్లస్టర్ ప్రాజెక్టుల పూర్తి వివరాల వెల్లడి

కృష్ణా జిల్లాకు కేంద్రం ప్రత్యేక దృష్టి

మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ క్లస్టర్ – పూర్తి

విజయవాడ గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్ – పూర్తి

జగ్గయ్యపేట గోల్డ్ ఆర్నమెంట్ క్లస్టర్ – పూర్తి

మచిలీపట్నం జ్యువెలరీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్‌గ్రేడేషన్ – కొనసాగుతోంది

గన్నవరం వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఫేజ్–III) – కొనసాగుతోంది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *