మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ICPS, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), చిల్డ్రన్స్ హోమ్స్, విజయవాడలలో కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి స్థానిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి షేక్ రుక్సానా బేగం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 సంవత్సరాలు, దివ్యాంగ మహిళా అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. కౌన్సిలర్–1, డేటా ఎంట్రీ ఆపరేటర్–1, పార్ట్‌టైం డాక్టర్–1, ఆయా–4, ఎడ్యుకేటర్ (పార్ట్‌టైం)–2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్ (పార్ట్‌టైం)–2, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (పార్ట్‌టైం)–2, హెల్పర్ (ఔట్‌సోర్సింగ్)–1.
దరఖాస్తుల స్వీకరణ 11-08-2026 నుండి 18-08-2026 సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ntr.ap.gov.in వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి, అవసరమైన అన్ని ధ్రువపత్రాల నకళ్లను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి కార్యాలయం, డోర్ నెం.31-4-29/A, గద్దె పూర్ణచంద్రరావు వీధి, మారుతీనగర్, 2వ లైన్, విజయవాడ–520004 చిరునామాలో 18-08-2026 సాయంత్రం 5.00 గంటలలోపు స్వయంగా సమర్పించాలని సూచించారు. పోస్టుల అర్హతలు, వేతనాలు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి షేక్ రుక్సానా బేగం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *