-ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నెట్టెం శ్రీ రఘురామ్ — కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం
కొనకంచి, నేటి పత్రిక ప్రజావార్త :
కొనకంచి గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో పర్యటించిన నెట్టెం శ్రీ రఘురామ్ అక్కడి ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై వివరాలు సేకరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు కసుకుర్తి దశరథ రామారావు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ కాసిం సాహెబ్ (KDR), PACS ఛైర్‌పర్సన్ నెట్టెం దుర్గాభవాని, సొసైటీ డైరెక్టర్లు నర్సింగి శ్రీనివాసరావు, గజ్జి స్వామి, పెనుగంచిప్రోలు మండల మాజీ వైస్ ఎంపీపీ కాకుమాను వెంకట నరేష్ (కన్నయ్య), మాజీ సర్పంచ్ కాసాని శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కన్నేటి పద్మజ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుమాను జగదీష్, మాజీ సొసైటీ అధ్యక్షులు కాకుమాను శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు లంజపల్లి సాగర్, మైనార్టీ నాయకులు షేక్ కాలం సాహెబ్, బ్రాంచ్ మేనేజర్ లీలావతి, బ్యాంకు అధికారులు, సొసైటీ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News