Breaking News

విజయవాడలో ఆర్‌ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ…..

-జెండా ఊపి ప్రారంభించిన ఆర్‌ అండ్ బి ఇంజనీర్-ఇన్-చీఫ్ వి.రామచంద్ర
-మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎమ్ బిఏ),లో భాగంగా రాష్ట్ర రోడ్లు & భవనాల (ఆర్‌ అండ్ బి) శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈ ర్యాలీని ఆర్‌ అండ్ బి ఇంజనీర్-ఇన్-చీఫ్ వి. రామచంద్ర జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ,రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌పై ప్రజలను చైతన్యపరచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే అరికట్టకపోతే సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ పరిధిలోని వారికి కూడా అవగాహన కల్పించాలని ఈ ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు. సమాజానికి పెను ముప్పుగా మారిన మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ కె.నవీన్ మాట్లాడుతూ సమాజానికి పెను ముప్పుగా మారిన మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, డ్రగ్స్‌కు బానిస కాకుండా ఆరోగ్యకరమైన, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, యువతలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా ఆర్‌ అండ్ బి శాఖ హెచ్‌ఓడీ భవనం వరకు సాగింది.

అవగాహన ర్యాలీలో సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.వి. భాస్కరరావు, ఇఇ రవిశంకర్, డిఇఇ వై.శశిభూషణ్ తో పాటు శాఖకు చెందిన సుమారు 100 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *