Breaking News

HNSS ఫేజ్–II పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతి

-సీఎం చంద్రబాబు చొరవపై మంత్రి మండిపల్లి హర్షం
-రాయచోటి నియోజకవర్గ పరిధిలో 490–535 కి.మీ. వరకు సుమారు రూ.350 కోట్లతో పనులు
-25 వేల ఎకరాల ఖాళీ చెరువులు నింపి.. ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం….మంత్రి మండిపల్లి
-463–554 కి.మీ. వరకు మొత్తం పనులను సింగిల్ ప్యాకేజీగా చేపట్టేలా ప్రతిపాదన
-రాయచోటి, అన్నమయ్య జిల్లా ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత…మంత్రి మండిపల్లి
-సీఎం చంద్రబాబు నాయుడు కి, మంత్రి నిమ్మల రామానాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో భాగంగా మిగిలిన మెయిన్‌ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్‌ కెనాల్‌ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

HNSS మెయిన్‌ కెనాల్‌ను తొలుత లైనింగ్ లేకుండా నిర్మించడంతో డిజైన్‌ చేసిన 2,520 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు ఇబ్బందులు ఉన్నాయని, అందువల్ల మిగిలిన కాలువ పనులతో పాటు CC లైనింగ్‌ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో HNSS మెయిన్‌ కెనాల్‌ కిమీ 400.500 నుంచి 485.300/490.000 వరకు మిగిలిన పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య జిల్లాలో కిమీ 490.000 నుంచి 554.175 వరకు మెయిన్‌ కెనాల్‌ పనులతో పాటు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నీవా బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు అనుమతి లభించిందని తెలిపారు.

రాయచోటి నియోజకవర్గ పరిధిలో HNSS మెయిన్‌ కెనాల్‌ కిమీ 490 నుంచి 535 వరకు సుమారు 45 కి.మీ. మేర పనులు ఉన్నాయి. ఈ పనులకు సుమారు రూ.290 కోట్లు, అదనంగా రూ.60 కోట్లతో కలిపి మొత్తం సుమారు రూ.350 కోట్ల విలువైన పనులు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కిమీ 463 నుంచి 554 వరకు HNSS మెయిన్‌ కెనాల్‌ పనులను ఒకే సింగిల్‌ ప్యాకేజీగా చేపట్టే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మన నియోజకవర్గ పరిధిలోని 490–535 కి.మీ. పనులు కూడా ఈ సమగ్ర ప్యాకేజీలో భాగం కానున్నాయి.

ఈ పనులు పూర్తయితే HNSS ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేసి, కేవీ పల్లి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, పీలేరు, చిత్తూరు ప్రాంతాలకు తాగునీరు అందించడంతో పాటు సాగునీటి అవసరాలను తీర్చేందుకు మరింత ఉపయోగపడుతుందని, 25 వేల ఎకరాల ఖాళీ చెరువులు నింపి ప్రజలకు నీటి భరోసా కల్పిస్తాం మంత్రి అన్నారు.

అలాగే HNSS కెనాల్‌ ద్వారా శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని ఖాళీ చెరువులను నింపేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంలో HNSS పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా ప్రజల చిరకాల నీటి అవసరాలను గుర్తించి HNSS పనులకు భారీగా నిధులు కేటాయించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి , జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ, దూరదృష్టితో ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీటి భరోసా మరింత బలోపేతం కానుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

HNSS మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా నీటి ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *