-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై హర్షం
-గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు
-సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్వవాదాలు
-బీసీలకిచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న కూటమి
-రిజర్వేషన్లతో బీసీలకు మరిన్ని పదవులు
-బీసీలపై కక్షగట్టిన జగన్
-బీసీ రిజర్వేషన్లకు 10 శాతం కోత
-వైసీపీ నిర్వాకంతో 16,800 పదవులకు దూరమైన బీసీలు
-బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చిన టీడీపీ
-సీఎం చంద్రబాబు రాకతో మరోసారి మంచిరోజులు ప్రారంభం
-సంక్షేమ దన్నుతో బీసీలకు ఆర్థిక భరోసా : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘చరిత్రలో ఈరోజు బీసీలు మరిచిపోలేని రోజు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు కాబోతున్నాయి…’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సంతోషం వ్యక్తంచేశారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు జగన్ ప్రభుత్వం కోత పెట్టడం వల్ల 16 వేలకు పైగా పదవులకు బీసీలు దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల బిల్లు చర్చ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు ఎస్.సవిత మాట్లాడారు. బీసీల పక్షపాత్రి ప్రభుత్వం తమదని మరోసారి రుజువైందన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పించాలని నిర్ణయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై మంత్రిమండలిలో ఆమోదించామన్నారు. అసెంబ్లీలో కూడా ఆమోదిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు మొట్టమొదటిసారిగా 1994లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనతో బీసీలకు రాజ్యాధికారంలో అవకాశం కలుగుతుందన్నారు. తమను తాము పాలించుకునే అవకాశం కలుగుతుందని, చరిత్రలో నేడు మరిచిపోలేని రోజు అని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు.
బీసీలను ప్రోత్సహించిన టీడీపీ
బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీయేనని మంత్రి సవిత తెలిపారు. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తన తండ్రి ఎస్.రామచంద్రారెడ్డి వంటి ఎందరో బీసీ నేతలు అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ప్రోత్సహంతో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని మంత్రి సవిత తెలిపారు.
బీసీ రిజర్వేషన్లకు జగన్ కోత
సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షపాతమేనని జగన్ కక్షగట్టారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందన్నారు. రిజర్వేషన్లలో కోత వల్ల 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి రాగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం చంద్రబాబునాయుడు సైతం బీసీలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ బిల్లును రూపొందించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. బీసీలకు మరోసారి రాజకీయ పట్టం కల్పిస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
కూటమి రాకతో బీసీలకు సంక్షేమ దన్ను
సీఎం చంద్రబాబు రాకతో బీసీలకు మరోసారి మంచిరోజులు వచ్చాయని మంత్రి సవిత తెలిపారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, బీసీలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత బీసీలకు మొదటి బడ్జెట్ లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్ లో రూ.47 వేలు కోట్లు, మూడో బడ్జెట్ లో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వ తదుపరి చర్యకు పంపించామని గుర్తు చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. గీత కార్మికులకు మద్యంషాపులు, బార్లు కేటాయింపుల్లోనూ 10 శాతం మేర కేటాయించామన్నారు. మద్యం షాపుల లైసెన్స్ లో 50 శాతం రాయితీ ఇచ్చామన్నారు. వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు, 50 శాతం మేర సినరేజీ మినహాయింపు ఇచ్చామన్నారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. 62,541 నేతన్నలకు 200లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 85,940 మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 71,536 మంది చేనేతలకు నేతన్నల సేవలో పథకం వర్తింప జేశామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు మేలు కలుగజేయాలన్న సంక్పలంతో నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2024-26 మధ్య 15.67 లక్షల బీసీ లబ్ధిదారులకు రూ.15,588.64 కోట్లు చెల్లించామన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందజేశామన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా 40,610 మంది ఆటో డ్రైవర్లకు రూ.60.91 కోట్లు కేటాయించామన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కూటమి ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు రాయితీ అందజేస్తోందన్నారు. తల్లికివందనం, ఫ్రీ బస్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత ఇసుక, పెన్షన్లు ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని మంత్రి సవిత తెలిపారు.
Prajavartha Online Telugu News