Breaking News

బీసీలకు కలియుగ జాతిపిత నారా చంద్రబాబు నాయుడే…. లుక్కా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై సీనియర్ బీసీ నాయకులు,రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్,మాజీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ నేడొక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్వవాదాలు తెలిపారు. రిజర్వేషన్లతో బీసీలకు మరిన్ని పదవులు కలిగే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీసీలపై గత ప్రభుత్వం జగన్ రెడ్డి కక్షగట్టి బీసీ రిజర్వేషన్లకు 10 శాతం కోత విధించాడని,జగన్ రెడ్డి నిర్వాకంతో 16,800 పదవులకు బీసీలు దూరమైన విషయం గుర్తు చేశారు. బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చిన పార్టీ టీడీపీ అని,సీఎం చంద్రబాబు రాకతో మరోసారి బీసీలకు మంచిరోజులు వచ్చాయి అన్నారు.

చరిత్రలో ఈరోజు బీసీలు మరిచిపోలేని రోజు అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం అమలు కాబోతున్నాయి అని లుక్కా సంతోషం వ్యక్తంచేశారు. బీసీల పక్షపాతి చంద్రబాబు గారు అని మరోసారి రుజువైందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు మొట్టమొదటిసారిగా 1994లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పనతో బీసీలకు రాజ్యాధికారంలో అవకాశం కలుగుతుందన్నారు.బీసీలు తమను తాము పాలించుకునే అవకాశం కలుగుతుందని, చరిత్రలో నేడు మరిచిపోలేని రోజు అని లుక్కా ఆనందం వ్యక్తం చేశారు.

బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ యేనని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు.యనమల రామకృష్ణుడు,కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి,వంటి ఎందరో బీసీ నేతలు అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ప్రోత్సహంతో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు.

బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అని జగన్ రెడ్డి బీసీల పై కక్షగట్టారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందన్నారు. రిజర్వేషన్లలో కోత వల్ల 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన యువ గళం పాదయాత్రలో గుర్తించారన్నారు. అధికారంలోకి రాగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం చంద్రబాబునాయుడు సైతం బీసీలకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ బిల్లును రూపొందించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారని తెలిపారు.

సీఎం చంద్రబాబు రాకతో బీసీలకు మరోసారి మంచిరోజులు వచ్చాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, బీసీలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత బీసీలకు మొదటి బడ్జెట్ లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్ లో రూ.47 వేలు కోట్లు, మూడో బడ్జెట్ లో రూ.51 వేల కోట్లు కేటాయించారన్నారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వ తదుపరి చర్యకు పంపించామని గుర్తు చేశారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వం కల్పించింది. గీత కార్మికులకు మద్యంషాపులు, బార్లు కేటాయింపుల్లోనూ 10 శాతం మేర కేటాయించారు. మద్యం షాపుల లైసెన్స్ లో 50 శాతం రాయితీ ఇచ్చారని. వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు, 50 శాతం మేర సినరేజీ మినహాయింపు ఇచ్చారన్నారు. చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచారన్నారు. 62,541 నేతన్నలకు 200లు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 85,940 మంది నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నారన్నారు. 71,536 మంది చేనేతలకు నేతన్నల సేవలో పథకం వర్తింప జేశారన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు మేలు కలుగజేయాలన్న సంక్పలంతో నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2024-26 మధ్య 15.67 లక్షల బీసీ లబ్ధిదారులకు రూ.15,588.64 కోట్లు చెల్లించారన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల చొప్పున 10.46 లక్షల మంది బీసీ విద్యార్థులకు రూ.1,360.61 కోట్లు అందజేశారన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా 40,610 మంది ఆటో డ్రైవర్లకు రూ.60.91 కోట్లు కేటాయించారన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కూటమి ప్రభుత్వం అదనంగా రూ. 20 వేలు రాయితీ అందజేస్తోందన్నారు. తల్లికివందనం, ఫ్రీ బస్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత ఇసుక, పెన్షన్లు ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని లుక్కా తెలిపారు.

కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి కూటమి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు గారి రుణం తీర్చుకోవాలని కోరారు.
బిసిలను మోసం చేసిన జగన్ రెడ్డికి బీసీలు ఇచ్చే తీర్పు చెంపపెట్టు లా ఉండాలని, వైసీపీ పార్టీ బీసీల చేతిలో భూస్థాపితం కావాలని రాష్ట్రం లో ఉన్న బీసీ లందరినీ కోరారు. బీసీలకు కలియుగ జాతిపిత నారా చంద్రబాబు నాయుడు గారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *