Breaking News

తెలుగు దేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ

-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం
-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ బీసీ నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ(ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ కార్యాలయం నందు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం బీసీ నేతలంతా కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ బీసీ విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు బీసీ నాయకులు మాట్లాడుతూ ముందుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం బీసీలంతా రుణపడి ఉంటారని అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుండే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని బీసీలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ఆరోజు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అయితే ఈరోజు ఆ విధానాలను ముందుకు తీసుకు వెళుతూ బీసీలకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. ఈ నిర్ణయం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

గత ఐదు సంవత్సరాలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసి బీసీలపై దాడులు చేయించిన పార్టీ నేడు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని నాయకులు విమర్శించారు పార్టీ ప్రారంభ రోజుల నుంచి బీసీలను పక్కన పెట్టుకొని బీసీలను హక్కున చేర్చుకుని ఉన్నది ఒక తెలుగుదేశం పార్టీ నేనని అందుకే బీసీల మద్దతు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకే ఉంటుందని బీసీలకు మేలు జరిగేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని నాయకులు తెలియజేశారు రేపు రాబోయే రోజుల్లో బీసీలకు మరిన్ని మంచి రోజులు ఉండబోతున్నాయని బీసీలకు ఇన్ని అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశామని నాయకులు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో నాగ వంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్,బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్,మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు,భాను సింగ్, చరణ్ సాయి యాదవ్, పాల మాధవ్, నమ్మి భాను ప్రకాష్, కుంచన దుర్గారావు, అడ్లూరి కొండ, కాకు మల్లికార్జున యాదవ్, పామర్తి కిషోర్ బాబు, మూరబోయిన రాంబాబు, దాడి మురళి ఉమామహేశ్వరరావు, ఈశ్వరరావు, నందే విజయలక్ష్మి, టిఎన్ఎస్ఎఫ్ మోడీ రాజు రాధిక,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *