Breaking News

భక్తుల కోర్కెలను తీర్చే కలియుగ దైవం శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి

-ఆలయ కమిటీ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి సమీపంలోని వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవంగా నిత్యం పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పిఎసి సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ సుమారు గత 13 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టామని అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ వస్తుందన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో వున్న విధంగా ఇక్కడ నిర్మాణాలను చేపట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడ స్వామివారు భక్తులను కోరికలను తీర్చే కలియుగ దైవంగా భక్తుల విశ్వాసమన్నారు. ఇక్కడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారన్నారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అన్ని సేవలు ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ భక్తుల విశ్వాసంతో, గ్రామ ప్రజల సహకారంతో ఆలయాభివృద్ధి విజయవంతంగా కొనసాగుతుండటం ఎంతో ఆనందంగా వుందన్నారు. ఎలాంటి భేదభావం లేకుండా ప్రతి భక్తుడికీ స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ఆలయంలో స్వామి వారికి వివిధ రకాలైన సేవలు, విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు, నైవేద్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌళిక సదుపాయాలతోపాటు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిత్యం స్వామి వారిని దర్శించుకొనే భక్తులు అర్చక స్వాములు అందించే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదం పొందడమే కాక స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని చైర్మన్ తెలిపారు. ప్రత్యేక పండుగ రోజులలో గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు సమిష్టిగా కార్యక్రమాల నిర్వహణలో పాల్గొని తమ సేవలందిస్తారన్నారు. భవిష్యత్‌లో తిరుమలకి వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులు వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్వామి వారి కృప భక్తులందరికీ సదా ఉండాలని ఆయన ప్రార్థించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *