విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ ఐదవ తరం మనవడు ముఖ్యఅతిథిగా హాజరయిన హైకోర్టు న్యాయవాది డొక్కా భాస్కర్ బాచి మీడియాతో మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వారసులను మొదటిసారి ఏపీకి తీసుకువచ్చిన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి ని అభినందించారు. చారిటబుల్ ట్రస్ట్ నెంబర్లు కు శుభాకాంక్షలు తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్టుకు సహాయం చేసే వారిని అందర్నీ ట్రస్ట్ వారు దగ్గరుండి సన్మానించటం అభినందనీయమన్నారు. ముందుముందు ఈ సేవా కార్యక్రమాలు ప్రతిరోజు నిత్య అన్నదానం చేసే స్థాయికి ఎదగాలన్నారు. తన వంతుగా ట్రస్ట్ కి కొంత విరాళాన్ని ప్రకటించి తమ వంశం దానగుణాన్ని చాటారు. డొక్కా సీతమ్మ దాన గుణాన్ని, విశిష్టతను తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, టిడిపి అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయ కుమారి మీడియాతో మాట్లాడుతూ డొక్కా సీతమ్మ వారసుడిని మొట్టమొదటిసారిగా విజయవాడకి అజిత్ సింగ్ నగర్, పి ఎన్ టి కాలనీ, లక్ష్మీ గణపతి టెంపుల్ వద్ద వున్నతమ నివాసంకి తీసుకురావడం జరిగిందని ప్రజలకి తెలియజేశారు. పలువురు అభిమానులు ఆయనని చూడడానికి వచ్చారని ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ఆయన చేతుల మీదుగా ట్రస్ట్ కి సహాయాన్ని అందిస్తున్న సుమారు 40 మందికి పైగా వున్న ప్రతి ఒక్కరిని సన్మానించి డొక్కా సీతమ్మ చిత్రం వున్న కప్పు తో పాటు బహుమతులు అందచేశారు. ఇంకా మాకు ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రజలు ఆశీస్సులు ఉంటే ప్రతి రోజు నిత్య అన్నదానానికి కృషి చేస్తామని ప్రతి పేదవాడికి ఆకలి బాధ తీరే విధంగా మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంకల్పంగా ముందుకు వెళ్తామని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి. ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి. కోశాధికారి యర్రోజ అభిలాష్. కార్యనిర్వహణ అధికారి పల్లా ఉమామహేశ్వరి. ఉపాధ్యక్షులు అవుటుపల్లి శ్రీనివాస్ మరియు ట్రస్ట్ కమిటీ మెంబర్స్ దాతలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News