అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను కురగల్లుకు చెందిన ఇద్దరు రైతులు స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. కురగల్లు గ్రామ పరిధిలోని 10.90 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారికి రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 ఆగస్టు 24న రైతులు అందజేశారు. కార్యక్రమంలో కురగల్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణారావు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలు పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో సహకరించాలని వారు కోరారు.
పూలింగ్ కింద భూములు ఇచ్చిన కురగల్లు గ్రామస్తుల వివరాలు:
1 దండా వీరారెడ్డి 2.90 ఎకరాలు
2 జంగా శ్రీనివాసరెడ్డి 8 ఎకరాలు
మొత్తం 10.90 ఎకరాలు
Prajavartha Online Telugu News