విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్ లోని ,సర్కిల్ వన్ కార్యాలయం వద్ద నాలుగో విడత , మంగళవారం నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ లను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది.
పేద, మధ్య తరగతి మహిళలు , గర్భిణీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను పేదల ముంగిటకే చేర్చాలని “సుజనా ఫౌండేషన్” లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 16 మంది గర్భిణీలకు 2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ విజయ్ సుధా,2 డీ ఏకో టెక్నీషియన్ కుసుమ ,వైద్య సేవలు అందించి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు..
కూటమి నేతలు నాగోతి రామారావు, వేంపలి గౌరీ శంకర్, పోతినిడి లోకేష్, బీ దుర్గారావు, వై ఆనంద్, జి వాసు యు పీ హెచ్ సీ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో సేవలందించారు.
Prajavartha Online Telugu News