విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, టీడీపీ నాయకులు మన్నెం నారాయణ, కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. చిట్టినగర్ కు చెందిన బీ శ్రీనివాసరావు (58) హృద్రోగం తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 8 లక్షల 63 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు
40 వ డివిజన్ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులోని దేవరాజు గట్టు అంకయ్య (56) హృద్రోగం తో పాటు వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 61 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. కొత్తపేటకు చెందిన కొయ్య రాము (49) కాలికి గాయమై వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల 92 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News