‘స్థానికం’లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం

-రాష్ట్ర బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత
-న్యాయ పోరాటానికి కూటమి ప్రభుత్వం సిద్ధం
-బీసీ రిజర్వేషన్ల అమలుతో జగన్ లో గుబులు
-బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
-5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కారు
-స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కుదింపుతో 16,800 పదవులకు బీసీలు దూరం
-జగన్ ధన దాహానికి బీసీలు బలి
-ఆనాడు బీసీల సంక్షేమం ఎందుకు రాలేదు..?
-స్థానిక ఎన్నికల కోసమే జగన్ మొసలి కన్నీరు
-వెనుకబడిన కులాలను అక్కున చేర్చుకున్న సీఎం చంద్రబాబు
-సామాజిక, రాజకీయ గుర్తింపునకు ప్రాధాన్యం : మంత్రి సవిత
-రొద్దం మండలం కొగిరలో ఇంటింటికీ తెలుగుదేశం
-రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ. 5లక్షల చెక్ అందజేత

రొద్దం/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
‘బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు… మీ అయిదేళ్ల పాలనలో బీసీలను అణగదొక్కారు…ఇదేంటని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైల్లో బంధించారు… బీసీ బిడ్డను పెట్రోల్ పోసి తగులబెట్టారు… అక్రమ సంపాదనకు, అవినీతికి బీసీలను పావులుగా చేసుకున్నారు… చివరికి బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అయిదేళ్లలో బీసీ హాస్టళ్లను, గురుకులాలను గాలి కొదిలేశారు… ఆనాడు బీసీల సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదా..?’అని జగన్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రశ్నించారు. బీసీలను రాజకీయంగా జగన్ దెబ్బతీస్తే… వెనుబడిన వర్గాలను సీఎం చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకున్నారన్నారు. బీసీలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే, రాజకీయంగా వారి ఉన్నతికి పదవులు కేటాయిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని, ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు. రొద్దం మండలం కొగిర గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, పెనుకొండ నియోజక వర్గంలో 85 శాతం మేర ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని, తమ నాయకులకు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఆమె ఆనందం వ్యక్తంచేశారు.

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు

నా బీసీలంటూ అధికారంలోకి వచ్చిన జగన్ బడుగు, బలహీన వర్గాల వారిని తన అయిదేళ్ల పాలనలో అణగదొక్కారని మంత్రి సవిత మండిపడ్డారు. సంక్షేమం, స్వయం ఉపాధి పథకాలు నిలిపేసి ఆర్థికంగా నిలదొక్కుకోకుండా అడ్డుకున్నారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించి, బీసీలను రాజకీయంగా దెబ్బతీశారన్నారు. దీనివల్ల బీసీలు 16,800 పదవులకు దూరమయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక బీసీ హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేశారన్నారు. ఇదేంటని ప్రశ్నించిన బీసీ నాయకులను అక్రమ కేసులు బనాయించి, జైల్లో నిర్బంధించారన్నారు. చివరికి బీసీలకు రక్షణ లేకుండా చేశారన్నారు. బీసీ బిడ్డపై పెట్రోల్ పోసి తగులబెట్టారన్నారు. వైసీపీ హయాంలో బీసీల జీవితం నరకప్రాయం మారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో, బీసీలపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ లేదని మంత్రిసవిత స్పష్టం చేశారు.

జగన్ అవినీతికి బీసీలు బలి

జగన్ అవినీతి, అక్రమార్జనకు వైసీపీకి చెందిన బీసీ నాయకులు బలైపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. బీసీ నాయకులకు పదవులు ఆశ చూపి, వారిని అక్రమ మద్యం తయారీ, మద్యం రవాణా, ఇసుక అక్రమ తవ్వకాలు ఇలాంటి కేసులు వారిని పావులుగా చేశారన్నారు. జగన్ ధన దాహానికి ఆయా కేసుల్లో బీసీలు ఇరుక్కోవడం బాధాకరమని మంత్రి సవిత అన్నారు. బీసీల మేలు కోరే సీఎం చంద్రబాబునాయుడు వారి రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు.

34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం…

స్థానిక సంస్థల్లో బీసీలకు మొట్టమొదటి సారిగా అన్న ఎన్టీఆర్ 27 శాతం మేర రిజర్వేషన్లు కల్పించారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. 2021లో బీసీ రిజర్వేషన్లను జగన్ 24 శాతానికి కుదించారన్నారు. దీనివల్ల బీసీలకు 16,800 పదవులకు దూరమయ్యారన్నారు. బీసీల సంక్షేమం కోరే సీఎం చంద్రబాబునాయుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని నిర్ణయించారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు.

అంతకుముందు కొగిరి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఆంజనేయుల కుటుంబానికి మంత్రి సవిత పరామర్శించారు. రూ.5 లక్షల జీవిత బీమా చెక్ ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. టీడీపీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమమే మంత్రి నారా లోకేశ్ లక్ష్యమన్నారు. ఆయన ముందు చూపుతో అమలుచేసిన రూ.5 లక్షల జీవిత బీమా కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబాలకు ఆసరాగా ఉంటోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *