సర్‌లో వేగం.. విచారణలో పారదర్శకత.. ఓటర్ల జాబితాలో కచ్చితత్వం

– ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో సర్ పురోగతిపై ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సమీక్ష
– నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలో రెండు జిల్లాల అధికారుల పురోగతిపై అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌పై గురువారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో భార‌త ఎన్నిక‌ల సంఘం సీనియ‌ర్ డిప్యూటీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ.. ఎన్‌టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల‌కు సంబంధించి ప్ర‌త్యేక స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఏపీ సీఈవో వివేక్ యాద‌వ్‌, ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, కృష్ణా క‌లెక్ట‌ర్ డా. డీకే బాలాజీ, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎం.న‌వీన్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం త‌దిత‌రులు పాల్గొన్నారు. అదేవిధంగా రెండు జిల్లాల‌కు సంబంధించిన 14 మంది ఈఆర్‌వోలు, ఒక్కో శాసనసభ నియోజకవర్గం నుంచి నలుగురు పోలింగ్ బూత్ స్థాయి అధికారులు హాజ‌ర‌య్యారు. స‌ర్ ప్ర‌క్రియ‌లోని ప్ర‌స్తుత ద‌శ‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారం గురించి డా. ప‌వ‌న్ కుమార్ శ‌ర్మ చ‌ర్చించారు. మ్యాపింగ్ కాని ఓట‌ర్లు, అందుబాటులో లేని ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మ‌ర‌ణించిన ఓటర్లు, ఒకచోట కంటే ఎక్కువ చోట్ల జాబితాలలో పేర్లను కలిగిన ఓటర్లు తదితర విషయాలలో ప్రత్యేక దృష్టితో కృషిచేసి గణనీయమైన ఫలితాలను సాధించినందుకు రెండు జిల్లాల అధికారులను అభినందించారు. అదేవిధంగా నోటీసుల జారీ, విచార‌ణ ద‌శ విష‌యంలో సాధించిన పురోగ‌తిపైనా, ఎదుర్కొన్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. ఎన్‌టీఆర్ జిల్లాలో 1,93,574, కృష్ణా జిల్లాలో 1,09,902 నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింది. ఎన్‌టీఆర్ జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 90,588, కృష్ణా జిల్లాలో 49,277 నోటీసులకు సంబంధించి ఓటర్లను విచారించ‌డం జ‌రిగింది. ఫారం 6, 7, 8 స్వీక‌ర‌ణ‌, ప‌రిష్కారంలోనూ ప్ర‌గ‌తి దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల ప‌రిష్కారాన్ని నిర్దిష్ట గ‌డువులోగా అత్యంత పార‌ద‌ర్శ‌కత‌, క‌చ్చిత‌త్వంతో పూర్తిచేయ‌నున్న‌ట్లు జిల్లాల ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. అర్హ‌త క‌లిగిన ప్ర‌తి ఓట‌రు జాబితాలో ఉండేలా, ఓటు భ‌ద్ర‌తకు భ‌రోసా క‌ల్పించేలా స‌మ‌ష్టి కృషితో ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్తున్న‌ట్లు వివ‌రించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *