విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట పాలనా విధానాల నుండి చేతి వృత్తి దారుల జీవితాలలో మార్పు రావాలని, సామాజిక, ఆర్థిక సంక్షేమం, ఆత్మగౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపుమేరకు 29- 08- 2026 న సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో లెనిన్ సెంటర్ నందు సమాఖ్య జిల్లా అధ్యక్షులు తాడి పైడయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యం తో పారిశ్రామిక విప్లవాని కన్నా ముందే సమాజానికి పునాదిగా సేవలందిస్తున్న చేతివృత్తిదారులు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న నప్పటికీ కావస్తున్నప్పటికీ నేటికీ అత్యంత దుర్భర జీవన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశంలో మార్పులు తీసుకొస్తానని పారదర్శకమైన పరిపాలన అందిస్తూ అందించి మంచి పరిపాలనందిస్తామని గొప్పలు చెప్పే అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ 18 రకాల చేతి వృత్తి దారులకు “విశ్వ కర్మ” యోజన పథకం కింద చేతి వృత్తి దారులను ఆదుకొని ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇచ్చిన హామీ సాధారణ సాంప్రదాయ చేతి వృత్తి దారుల కు ఉపయోగపడే డబ్బున్న కార్పొరేట్ సంస్థలకే ఆ పథకాలు ఉపయోగపడుతున్నాయని పైగా దేశంలో సమాజ అవసరాలు తీరుస్తున్న కష్టజీవులైన చేతి వృత్తి దారులు, పంటలు పండించే రైతులు,వ్యవసాయ రంగంలో తోడుగా ఉన్న వ్యవసాయ కార్మికులు, దేశ అవసరాలు తీరుస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా తన అనుంగు మిత్రులు అదాని, అంబాని వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షలాది కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేసి రాయితీలు,సబ్సిడీలు ఇచ్చి ఊడిగం చేస్తూ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి నరేంద్ర మోడీ పరిపాలన ఉపయోగపడుతోంది. నరేంద్ర మోడీతో అంటగాగుతూ రాష్ట్రంలో డబల్ ఇంజన్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా మిన్నగా సూపర్ సిక్స్ వాగ్దానాలతో చేతి వృత్తి దారులను అదు కుంటానని చెప్పి 60 రకాల కుల,వృత్తుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేటికీ రెండు న్నర సంవత్సరాల గడిచినా సబ్సిడీ రుణాలు అందించడం లేదు.50 నిండిన చేతి వృత్తి దారులందరకు పెన్షన్ ఇస్తానని,ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏమాత్రం నెరవేర్చడం లేదు రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో దేశ సహజ సంపద,దేశ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలు అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి వారు లాభాలు పొందేందుకు ఉపయోగ పడుతూ ఆకర్షమైన నినాదాలతో దేశ ప్రజలను మోసం చేస్తూ,మభ్య పెడుతున్నారు.రాష్ట్రంలో 30 రకాల చేతి వృత్తి దారులందరూ బడుగు, బలహీన, దళిత,గిరిజన మైనార్టీ వర్గాలకు చెందిన వీరి సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో కార్పొరేట్ కంపెనీలన్ని చేతి వృత్తుల లోకి చొరబడి చేతి వృత్తులను కబళించి వృత్తుల నుండి వెళ్లిపోయే పరిస్థితి సృష్టిస్తున్నారు. చేతి వృత్తి దారులు అర్థాకళితో జీవిస్తూ చేతి వృత్తులను వదలి వెళుతున్నారు.అందుకే చేతి దారుల జీవితాల్లో మార్పు రావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో తక్షణమే ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి చేతి వృత్తి దారుల జనాభా ప్రాతిపదిక న ఉప ప్రణాళిక ను ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి వృత్తుల వారీగా కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేసి ఖర్చు చేయాలని ప్రతి చేతి వృత్తి దారునికి వయస్సు తో నిమిత్తం లేకుండా ఐదు లక్షలు 50 రూపాయల సబ్సిడీతో బ్యాంకుల లింక్ కేజీ లేకుండా సొంత పూచికతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేయాలని,50 సంవత్సరాలైనా ప్రతి చతుర్థి దానికి 6000 రూపాయలు సామాజిక పరిచయాలు ఇవ్వాలని, వయసుతో నిమిత్తం లేకుండా వితంతు వైద్య పెన్షన్ ఇవ్వాలని వికలాంగులకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చేతి వృత్తి దారుల పిల్లలకు ఆశ్రమం పాఠశాలలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించి, చేతి వృత్తి దారుల పై జరుగుతున్న కుల, వివక్ష దాడులను అత్యాచారాలను అత్యాచారాలను,దౌర్జన్యాల ను అరికట్టడానికి రజకులపై దాడి కట్టెందుకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, వృత్తుల నిర్వహణకు అవసరమైన ముడి సరుకు,పరపతి, భూమి, నీరు, రోడ్లు,కరెంటు మొదలగు మౌలిక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని, ప్రతి చేతి వృత్తి దారునికి పట్టణాల్లో మూడు సెంట్లు, గ్రామాల్లో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, వృత్తుల ఆధునికరణకు సబ్సిడీ రుణాలు అందజేసి క్షేత్ర క్షేత్రస్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తుల నుండి రక్షణ కల్పించాలని, రజక, క్షవుర, మత్స్య, చేనేత, గీత, వడ్డెర ఎరకల,మేదర, గొర్రెల మేకల పెంపకం దార్లు, కుమ్మరి, పంచ వృత్తిదారులు, మత్స్యకారుల, దర్జీలు, చర్మ కారుల సంక్షేమం కోసం 20 రకాల డిమాండ్లతో డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం చేతి వృత్తి దారుల సమస్యలపై ఎన్ టి ఆర్ జిల్లా డి ఆర్ ఓ కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో చేతి వృత్తి దారుల సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రాచాకుల శ్రీనివాసరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్ధారపు వెంకట్రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి వి ఆంజనేయులు, శాలివాహన సంఘం నాయకులు ఏ. వెంకట్రామయ్య, గురునాథం, సిహెచ్ మారుతి, శ్రీనివాసరావు, పి రాము, ఎం.రాము,కె కృష్ణ బి రామకృష్ణ,డిహెచ్ పిఎస్ నగర నాయకులు సంగుల పేరయ్య, ప్రజానాట్యమడలి నాయకులు కెవి భాస్కరరావు, ఎ ఐ టి యు సి నగర నాయకులు కొట్టు రమణా రావు, ఎ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవింద రాజులు, వర్రపు నాగేశ్వరావు, ఎస్ కె సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News