– ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చ.. భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం
– పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర డిమాండ్లపై ప్రధానంగా చర్చ
– చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
– ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రాజీలేని వైఖరి
– ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్ స్పష్టీకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జేఏసీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం సెప్టెంబర్ 5న విజయవాడ ఎన్జీవో హోంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్ సెక్ట్రటరీ జనరల్ కె ఎస్ ఎస్ ప్రసాద్ లు ప్రకటన లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కమిటీల సభ్యుల పరిచయం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్–2025పై సమగ్ర చర్చ, పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలు, ఇతర ఉద్యోగుల డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు
రాష్ట్ర జేఏసీ నాయకులతో పాటు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల జేఏసీ ప్రధాన ప్రతినిధులు సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, మంత్రుల బృందం సమావేశంలో జరిగిన చర్చల అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి, పెండింగ్ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎ. విద్యాసాగర్ అన్నారు. బాధ్యతాయుతమైన ప్రధాన వ్యవస్థగా సంఘంగా చర్చిలో సానుకూల వాతావరణంలో జరిగేటట్లు ఒక ప్రణాళిక అబద్ధంగా బాధ్యతతో వ్యవహరిస్తున్నామని, చర్చలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మాత్రమే ఉద్యమ కార్యాచరణ అనివార్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య సానుకూల వాతావరణం కొనసాగుతోందని, ప్రభుత్వం ఉద్యోగుల మధ్య ఈ వాతావరణం రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకు మరింత మంచి సర్వీసులు అందించడానికి దోహదపడుతుందని విద్యాసాగర్ తెలిపారు.
పీఆర్సీ, డీఏలపై తక్షణ దృష్టి సారించాలి
పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక బకాయిల విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించేలా ప్రభుత్వం ఈ అంశాలపై అత్యవసరంగా దృష్టి సారించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వంగా వ్యవహరించడంతో పాటు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కూడా బాధ్యతాయుతమైన ధోరణితో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తారని ఎ. విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాయమైన డిమాండ్లపై రాజీ లేదు.. అవసరమైతే ఉద్యమమే
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల విషయంలో ఏపీ జేఏసీ రాజీలేని వైఖరితో ముందుకు సాగుతుందని, అదే సమయంలో రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘంగా బాధ్యతాయుతమైన విధానంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని, అయితే అవసరమైన పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణకు వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన 14 ప్రధాన ఉద్యోగుల సమ్మెలకు ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకత్వం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రభుత్వం వారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు చెల్లింపు, ఒకటో తారీఖున జీతాలు చెల్లింపు, 11 వేల మంది ఉద్యోగులకు ఓపిఎస్ వర్తింపు, 8000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పదవి విరమణ వయసుని ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకుల పాఠశాలకు 60 నుంచి 62 పెంచడం, అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు భాగస్వామ్యం చేయడం అంటే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఉద్యోగుల పిఆర్సిడిఏ తదితర ఆర్థిక అంశాలలో ముందుకు రావలసిన బాధ్యత ప్రభుత్వం దేని అన్నారు.
సానుకూల స్పందనపై విశ్వాసం.. లేకుంటే ఉద్యమ కార్యాచరణ
ప్రస్తుతం ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించి ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరిస్తుందనే విశ్వాసం తమకు ఉందని ఎ. విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తదుపరి ఉద్యమ కార్యాచరణపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Prajavartha Online Telugu News