వక్ఫ్ సంస్థల పురోగతిపై ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇన్‌స్పెక్టర్-ఆడిటర్లు, వక్ఫ్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్ఫ్ సంస్థల సందర్శనలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ అంశాలు, కొనసాగుతున్న వివిధ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఉన్న వక్ఫ్ సంస్థల సంఖ్య, ఇన్‌స్పెక్టర్-ఆడిటర్లు ఇప్పటివరకు సందర్శించిన సంస్థలు, సందర్శనలకు సంబంధించిన ఆధారాలు, ఇంకా సందర్శించాల్సిన సంస్థలు, వాటిని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. అలాగే, వివిధ విభాగాల పనితీరు, సమస్యలు, సవాళ్లు, పెండింగ్ అంశాలపై సంబంధిత విభాగాధిపతులతో చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను సూచించారు.

ప్రాజెక్ట్ అమానహ్‌పై దృష్టి

వక్ఫ్ ఆస్తుల క్షేత్రస్థాయి సమాచార సేకరణ, రికార్డుల ధృవీకరణ, డిజిటలైజేషన్ కోసం రూపొందించిన “ప్రాజెక్ట్ అమానహ్” పై చైర్మన్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి వక్ఫ్ ఆస్తికి ప్రత్యేక ఐడీ కేటాయించి, ఆస్తి వివరాలు, భౌతిక స్థితి, ఫోటోలు, ఆక్రమణలు, న్యాయపరమైన అంశాలు, రికార్డుల వ్యత్యాసాలు తదితర సమాచారాన్ని ఆధారాలతో సేకరించి, ధృవీకరించిన డిజిటల్ రికార్డుగా రూపొందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ముందు 7 రోజుల పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించనున్నారు. ఇందులో ఫీల్డ్ డేటా సేకరణ, ఫారమ్ వినియోగం, డేటా నాణ్యత, రిస్క్ గుర్తింపు, యాక్షన్ ట్రాకింగ్, జిల్లా స్థాయి డ్యాష్‌బోర్డ్ వంటి అంశాలను పరీక్షించి, అవసరమైన సవరణలు చేసిన అనంతరం ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు. అప్పగించిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని చైర్మన్ సిబ్బందికి సూచించారు. ప్రతి విభాగం సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ యాఖూబ్ ఖాజీ, డీఈఈ అబ్దుల్ ఖాదర్, ఇన్‌స్పెక్టర్-ఆడిటర్లు, సెక్షన్ హెడ్‌లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *