రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలి

-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాలు, మెడికో-లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్ కేసుల్లో సంభవించే మరణాలు సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు సకాలంలో నివేదించబడకపోవడంతో మరణాల నమోదు ఆలస్యం అవుతుండడoతో మరోసారి అధికారులకు తెలియజేసింది. అంతేగాకుండా..ఈ మరణాల వివరాలను నిర్ణీత విధానంలో సకాలంలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరోగ్యశాఖ కార్యదర్శి 2026 ఆగస్టు 21న రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయం 2026 ఆగస్టు 25న రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సర్క్యులర్ జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలు, ఇతర మెడికో-లీగల్ మరణాల వివరాలను చట్టం, నిబంధనల ప్రకారం నిర్ణీత ఫారం-IIలో సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్లకు నివేదించాలని పోలీసు అధికారులకు సూచించింది.
జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 8, జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం–2023, ఆంధ్రప్రదేశ్ జనన, మరణాల నమోదు నిబంధనలు–2025 ప్రకారం మరణ వివరాలను సంబంధిత జనన, మరణాల రిజిస్ట్రార్‌కు నిర్ణీత ఫారం-IIలో సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రమాద స్థలంలో వ్యక్తి మరణిస్తే….!

రోడ్డు ప్రమాద స్థలంలోనే వ్యక్తి మరణించిన సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫారం-IIలో మరణ వివరాలను ప్రమాదం జరిగిన ప్రదేశానికి పరిధి కలిగిన జనన, మరణాల రిజిస్ట్రార్‌కు మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోగా నివేదించాలి. ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో వ్యక్తి మరణించి, ఆసుపత్రి అధికారులు “brought dead”గా ప్రకటించిన సందర్భంలోనూ ఇదే విధానం వర్తిస్తుంది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించిoది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *