నీతి పద్యాల పుస్తకాలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం చదువుటం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా మినీ, పాకేట్ సైజు పుస్తకాలు ఉచితంగా విద్యార్థుల కోసం పంపిణీ చేయబడెను. పి తులసి నాథం నాయుడు పలమనేరు చిత్తూరు జిల్లా వారిచే రచించబడిన 108 పద్యాల మరియు భావాలతో రూపొందించిన పుస్తకాలను ఈరోజు ఠాగూర్ గ్రంధాలయంలో విద్యార్థులకు ఉచితముగా పంచబడెను. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి కే రమాదేవి మాట్లాడుతూ రచయిత పి తులసి నాథం నాయుడు గారు ప్రపంచ రచయితల మహాసభలలో ఉచితముగా అందరికీ పంచుతుండగా నేను వారిని మా విద్యార్థు లకు నేర్పించుకొనుటకుఅడగగా 50 పుస్తకాలు చిత్తూరు జిల్లా నుంచి పంపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకొనుచున్నాను. రమాదేవి మాట్లాడుతూ
విద్యార్థు లు చిన్ననాటి నుంచి నీతి పద్యాలు నేర్చుకోవడం వల్ల తల్లిదండ్రులను, గురువులు, పెద్దలను
గౌరవించటం నేర్చుకుంటారు. అంతేకాక పద్యాల కంఠస్థం చేయడం వల్ల జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతాయి తెలుగు భాష పై ఆసక్తి పద సంపద అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి తను ఖాళీ టైం లో ప్రయాణాలయ ందు ఈ పుస్తకం చేతులో కానీ జేబులో కానీ పెట్టుకొని చదువుకునే విధంగా ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి శ్లోకాలని నేర్చుకోవాలని కోరుకుంటూ రచయిత పీ.తులసి నాథం నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *