విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌పై ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ మరింత దృష్టి సారించింది. రాష్ట్ర ప్రజల ఆహార అభిరుచులకు అనుగుణంగా ఇప్పటికే పలు ఉత్పత్తులను అందిస్తున్న సంస్థ, తాజాగా మరికొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సాంబార్ మసాలా, రసం మసాలాకు మంచి ఆదరణ ఉండగా, మసాలా కారం, కారం గోల్డ్ పికిల్ చిల్లీ, కరివేపాకు పొడి, ఇడ్లీ కారం పొడి, కంది పొడి వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తోంది.
పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని స్వీట్లలోనూ కొత్త రుచులను పరిచయం చేసింది. గులాబ్ జామున్, మైసూర్ పాక్‌తో పాటు కాలా జామున్, డ్రై జామున్, కేసర్ బాదామ్ గులాబ్ జామున్, బెల్లం, నెయ్యితో తయారు చేసిన ప్రత్యేక మైసూర్ పాక్, మైసూర్ పాక్ డేట్ బైట్స్ వంటి ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తమకు ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని ఎంటీఆర్ ఫుడ్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునయ్ భాసిన్ తెలిపారు. రాష్ట్ర ప్రజల అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను తీసుకురానున్నట్లు చెప్పారు. గుంటూరులోని తయారీ కేంద్రం సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాల అందుబాటుతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటీఆర్ ఫుడ్స్ అధికారులు, మార్కెటింగ్, వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News