రాబోయే ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలను వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాబోయే ఎన్నికల నిర్వహణను అత్యంత పటిష్టంగా, పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుపై తక్షణమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే నల్లపాడులోని పాలటెక్నిక్ కాలేజి, లయోలా స్కూల్, ఏసి కాలేజీలను పరిశీలించామని, మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీని కూడా పరిశీలించడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్ల మ్యాప్ ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పరిశీలించిన వాటిలో వసతులు, అవసరమైన వాటి వివరాలతో నిర్దేశిత పాయింట్స్ తో మ్యాప్ సిద్దం చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుపై సర్వేయర్ల తో సమన్వయం చేసుకొని మ్యాప్ లు సిద్దం చేయాలన్నారు.
పర్యటనలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటి కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ డి.రాంబాబు, సర్వేయర్లు లక్ష్మీనారాయణ, సుభాని పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *