-2026 జనవరి 1వ తేదీ నాటి ఓటర్లను ప్రామాణికంగా ప్రకటన
-కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను మంగళవారం నగరపాలక కార్యాలయంలో ప్రదర్శించామని, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా తీసుకుని సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను సిద్దం చేసినట్లు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గతంలో 57 వార్డులు ఉండగా, ఇటీవలే 76 వార్డులుగా పునర్విభజించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో పురుషులు 3,01,548 మంది, మహిళలు 3,18,938 మంది, ఇతరులు 80 మంది కలిపి మొత్తం 6,20,566 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్లు తమకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News