తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం అభివృద్ధికి రూ.51 కోట్ల నిధులు
-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

మచిలీపట్నం: సెప్టెంబరు 22, 2026
మచిలీపట్నం పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా ఒకేసారి రూ.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

మంగళవారం కుప్పం నియోజకవర్గం కడపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.51 కోట్ల విలువైన పనులకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను కోరారు.

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని, సుమారు 160 డ్రైనేజీ గ్యాప్‌లను పూడ్చేందుకు రూ.15 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరిన్ని డ్రైనేజీ అభివృద్ధి పనులకు అదనపు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలో రెండు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్‌టీపీ) నిర్మాణానికి రూ.53 కోట్ల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఆధునిక సదుపాయాలతో కార్యాలయాన్ని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీ

-మచిలీపట్నం అభివృద్ధికి రూ.51 కోట్ల నిధులు
-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా ఒకేసారి రూ.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, మౌలిక వసతులతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

మంగళవారం కుప్పం నియోజకవర్గం కడపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.51 కోట్ల విలువైన పనులకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నం పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను కోరారు.

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని, సుమారు 160 డ్రైనేజీ గ్యాప్‌లను పూడ్చేందుకు రూ.15 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరిన్ని డ్రైనేజీ అభివృద్ధి పనులకు అదనపు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలో రెండు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్‌టీపీ) నిర్మాణానికి రూ.53 కోట్ల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఆధునిక సదుపాయాలతో కార్యాలయాన్ని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి, రోడ్ల వెడల్పు, మెడికల్ కాలేజీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రహదారి అనుసంధాన పనులను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా మెడికల్ కాలేజీ వైపు రాకపోకలు సులభతరం చేయనున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను కూడా దశలవారీగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను పూర్తి చేసేందుకు రూ.27 కోట్లతో చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పార్కులు, బరియల్ గ్రౌండ్లు, శ్మశాన వాటికలు తదితర ప్రజా మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని ప్రధాన శ్మశాన వాటిక అభివృద్ధికి ఒక ప్రైవేటు సంస్థ సుమారు రూ.2 కోట్లతో పనులు చేపడుతోందని తెలిపారు.

ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన జరిగినప్పటికీ వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులకు అవసరమైన నిధులు మంజూరు కావడంతో నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుందని తెలిపారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో, మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని మచిలీపట్నం అభివృద్ధికి పలు నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు.

మచిలీపట్నం–విజయవాడ రైల్వే మార్గం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, మచిలీపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి, జాతీయ రహదారి విస్తరణ తదితర పనులు పట్టణ రవాణా, కనెక్టివిటీకి ఉపయోగపడతాయని కొనకళ్ల నారాయణరావు తెలిపారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు భవిష్యత్తులో ఆరు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కత్తిపూడి–ఒంగోలు కోస్టల్ హైవేతో అనుసంధానం ద్వారా తీర ప్రాంత రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.

మచిలీపట్నం పోర్టు పనులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైతే స్థానికంగా పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని పట్టణంలోని ప్రధాన రహదారులతో అనుసంధానించేలా రహదారి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా తీర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీమ్ బేగ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, కూటమి నాయకులు సుబ్రహ్మణ్యం, గడ్డం రాజు, పంతం గజేంద్ర రావు, సుధాకర్, సుశీల, కుంభ రవి కిరణ్, కీర్తి, అనిల్ తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *