తల్లి,బిడ్డల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ఏర్పాటుచేసిన ఉచిత మొబైల్ 2డి ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. హెచ్ బీ కాలనీ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులను గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది.

పేద, మధ్య తరగతి మహిళలు , గర్భిణీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను “సుజనా ఫౌండేషన్” ఉచితంగా అందిస్తుంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 29 మంది గర్భిణీలకు 2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

డాక్టర్ ఎన్ వంశీ, 2 డీ ఏకో టెక్నీషియన్స్ సుప్రియ , సింధుప్రియ,వైద్య సేవలు అందించి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *