మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 39 వ డివిజన్, విద్యాధరపురం కు చెందిన మాజేటి కృష్ణమూర్తి ( 78) హృద్రోగం తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.50 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.

ఖుద్దూస్ నగర్ కు చెందిన షేక్ జహీర్ ఉన్నిసా (52) ప్రమాదంలో గాయపడి మోచేతికి గాయమావగా మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4.50 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 46 వ డివిజన్, గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన కే శ్యామ్ కిషోర్, (52) గాల్ స్టోన్స్ మరియు హెర్నియాతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 5.15 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన ఆసియా తబ స్సుమ్ తన నవజాత శిశువు అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 9 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు..

52 వ డివిజన్, కొత్తపేటకు చెందిన సామన దుర్గాప్రసాద్ (36) తాపీ పని చేస్తూ భవనం పైనుంచి పడి గాయమవగా అత్యవసర వైద్యం కోసం రూ 5.30 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. చిట్టి నగర్ కు చెందిన పీ జీవన్ కుమార్ (27) అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3.93 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, కూటమి నాయకులు మల్లెపు విజయలక్ష్మి, ఏలూరి సాయి శరత్, పెద్దిన శ్యామ్ సుందర్ బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలు అందజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *