Breaking News

మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

-అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్, పీడీ హౌసింగ్ రజిని కుమారి పబ్లికేషన్ నోటీసును జారీ చేశారు. రెండవ సాధారణ పురపాలక ఎన్నికల నేపథ్యంలో మేయర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో నామినేషన్ ఫారాలను పొంది, నిర్దేశించిన గడువులోగా సమర్పించవచ్చని తెలిపారు.

అదేవిధంగా, వివిధ వార్డులకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు తమ తమ వార్డుల్లో పబ్లికేషన్ నోటీసులను జారీ చేసి వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ పబ్లికేషన్లో అకౌంటెంట్ బొమ్మిడి శ్రీనివాస్, వివిధ వార్డుల రిటర్నింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …