పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గమన్ బ్రిడ్జి టోల్ ప్లాజా వద్ద భారీ రోడ్డు ప్రమాదం.

-ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ కి నివేదిక
-ఆర్డీవో ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు సమీపంలోని గామాన్ బ్రిడ్జ్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద రసాయనాల తో కూడిన పలు వాహనాలు ఢీకొనడంతో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి కలెక్టర్ కి నివేదిక సమర్పించడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. శనివారం గామాన్ బ్రిడ్జి ప్రాంతంలో టోల్ గేట్ వద్ద ఘటన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు వివరాలు తెలుపుతూ, ప్రమాద భరిత మైన గ్యాస్ లతో నిండిన రెండు వాహనాల్లో ఒక వాహనాన్ని ఖాళీ చెయ్యడం జరిగిందన్నారు. మరో వాహనంలో ఉన్న గ్యాస్ ఖాళీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెసర్స్ వర్జిన్ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బృందం రాత్రి 7 గంటలకు ప్రమాద ప్రాంతానికి చేరి మిథనాల్ డై క్లోరైడ్ ఉన్న వాహనం నుంచి రసాయనాన్ని సురక్షితంగా బయటకు తీసేందుకు రావడం జరుగుతోందన్నారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో 2 ప్రమాదకరమైన రసాయనాలను తీసుకువెళ్లే వాహనాలు కావడంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడినా, . సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, ఆంధ్ర సుగర్స్ కెమికల్స్ భద్రతా అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారన్నారు. ఈ ఘటన లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం జరిగిందని మల్లిబాబు తెలిపారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స ను అందించిన కొవ్వూరు ఆంధ్ర సుగర్స్ యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటు చేశారన్నారు.

2 లారీలలో ఉన్న ట్రై క్లోరో ఫాస్పేట్, మిథనాల్ డై క్లోరైడ్ రసాయన పదార్థాలు ఉన్నాయన్నారు. గుజరాత్ నుంచి తుని కి 10 కెఎల్ తో వెళుతున్న ప్రోస్ఫరేస్ ట్రై క్లోరైడ్ రసాయన వాహనం, కర్నూలు నుంచి ఒడిశా లోని పరదీప్ కి మిథనాల్ డై క్లోరైడ్ రసాయన వాహనం వెళుతున్న ట్లు తెలిపారు. పోలీసులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి ట్రాఫిక్ను క్రమబద్దీకరించి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్ ఐ ఓ (ఇంటిలిజెన్స్) రఘువీరారెడ్డి, , కొవ్వూరు తహసీల్దార్ బి.నాగరాజు నాయక్, సి ఐ రామకృష్ణ, పోలీస్, అగ్నిమాపక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితి ని పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *