రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నూరు శాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేసారు. శనివారం హోసింగ్ పై డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డా. మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పధకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరవేయావేయ్యడం లో నిబద్దత తో పనిచెయ్యాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రతి లబ్ధిదారుని చే ఇంటి నిర్మాణాలు చేపట్టెందుకు దిశా నిర్దేశం చెయ్యాలన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు తదుపరి స్టేజి దిశగా అడుగులు వెయ్యడానికి కృషి చెయ్యాల్సి ఉందన్నారు. ఇప్పటికి ఇంటి నిర్మాణం ప్రారంభం చెయ్యని వారికీ మొబైలైజేషన్ ఫండ్ కింద రూ.15 వేలు ముందస్తు అడ్వాన్స్ ఇచ్చి ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మాధవీలత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం అందచేసే ఆర్ధిక ప్రయోజనాలు ప్రజలకు చేరవేసే ప్రణాళిక లో భాగంగా మంజురైనా ఏ ఒక్క లబ్ధిదారుని ఇంటి మంజూరు రద్దు కాకుండా చూడాలని కలెక్టర్ మాధవీలత తెలిపారు. వారం వారం డివిజన్ పరిధిలో లక్ష్యాలని నిర్దేశించుకోవాలన్నారు. రాజమండ్రి డివిజన్ కి 2651, కొవ్వూరు డివిజన్ కి 1780 లక్ష్యాన్ని ఇవ్వడం జరిగిందని, ప్రతి రెండు రోజులకు లక్ష్యా లపై సమీక్షా చెయ్యాలని డివిజన్ స్థాయి అధికారులకి స్పష్టంగా తెలియ చేసారు. ఇంటి నిర్మాణాలు కోసం ఎస్ హెచ్ జి రుణాలను అనుసంధానం చెయ్యడం పై ద్రుష్టి సారించాలని పేర్కొన్నారు. రోజు వారి గా ఎవరికీ వారు మండల, గ్రామ స్థాయి లో లక్ష్యాలకి అనుగుణంగా అడుగులు వెయ్యడం పై ప్రత్యేక ద్రుష్టి సారించా లని ఆదేశించారు. ఈ సమావేశం లో కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో ఏ. సుబ్బారావు, డి హెచ్ ఓ తారా సింగ్, వీడియో కాన్ఫరెన్స్ లో కొవ్వూరు, రాజమహేంద్రవరం డివిజన్ అధికారులు,వివిధ మండలాలకి చెందిన తహసీల్దార్ లు, ఎంపిడి వో లు, హోసింగ్ అధికారులు తదితరులు హాజయ్యారు.
Prajavartha Online Telugu News