రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కార్యాలయానికి స్పందన లో మొత్తం 24 ఫిర్యాదులు వోచ్చాయని మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది మనస్సు పెట్టి పనిచేయడం ద్వారా వారికీ సమస్య లేకుండా చూడాలన్నారు మనం భాద్యతతో పనిచేసి, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ద్వారా నగర అభివృద్ధి లో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చెయ్యగలుగుతామని పేర్కొన్నారు. ఈరోజు అందిన 24 ఫిర్యాదులను వొచ్చే వారానికి పరిష్కారం చూపాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కానటువంటి దైతే సహెతుకమైన కారణాలు వారికీ తెలియ చెప్పే భాద్యత అధికారులదే అన్నారు. ప్రజలు ఈరోజు ఇంటి ఎస్సెస్ మెంట్, పన్నులు, పారిశుధ్యం, క్వారీ సమస్య తదితర వాటిపై ఫిర్యాదు లు ఇవ్వడం జరిగింది. ఈ స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు పాండురంగారావు, సూరజ్ కుమార్, సాంబశివరావు, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News