
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2021-2022 విద్యాసంవత్సరంలో నలంద డిగ్రీ కళాశాలలో 285 మంది విద్యార్ధులు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్స్ సాధించిన సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘నలంద సక్సెస్ మీట్ – 2022’ – కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి . కె.బి. చంద్రశేఖర్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) డి. మేరిప్రశాంతి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె.బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్ధులు ఉద్యోగాలు పొందడంతో పాటు పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, ఏ కళాశాల అయినా చక్కటి విద్య అందించి, విద్యార్థులకు ఉపాధి చూపించినపుడే కళాశాల అభివృద్ధి పధంలో ఉంటుందన్నారు. నలంద కళాశాలకు చెందిన 285 మంది విద్యార్థులు దేశంలోనే ప్రముఖ కార్పోరేటు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. నలంద డిగ్రీ కళాశాల కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. విద్యార్ధులు విద్యతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, స్కిల్స్ వుంటే ప్రతి ఒక్కరూ రాణించగలుగుతారన్నారు. కృష్ణాయూనిర్సిటీ పరిధిలోనే అత్యధిక ప్లేస్‌మెంట్సు విద్యార్ధులకు ఇచ్చిన కళాశాలగా నలంద డిగ్రీ కళాశాల ఉందన్నారు.నలంద డిగ్రీ కళాశాలను ఆదర్శంగా తీసుకుని వర్శిటీ పరిధిలోని మిగతా కళాశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు(అడ్మిన్) డి.మేరి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్ధులు చక్కని ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు. విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక, క్రీడలు పోటీ పరీక్షల్లో కూడా అవగాహన పెంచుకుని ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఒక విద్యాసంవత్సరంలో ఒకే కళాశాల నుండి 285 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు నలంద డిగ్రీ కళాశాల సాధించాలన్నారు. ఈ నలంద విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎ.విజయబాబు మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్ధులకు సిలబస్‌లో మార్పులు చేస్తూ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకమైన విజన్‌తో విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని తీర్చిదిద్దేందుకు నలంద విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. గత 23 సంవత్సరాలుగా నలంద డిగ్రీ కళాశాల ఎంతో మంది విద్యార్ధులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశ, విదేశాలలో అత్యుత్తమ ఉద్యోగాలలో వున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిననలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.అనూరాధ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్ధులకు విద్యతోపాటు ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో కోర్సుల రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో డేటా సైన్సు, విజువల్ కమ్యూనికేషన్స్, బిబిఎ బిజినెస్ ఎనలిటిక్స్ వంటి నూతన కోర్సులను ప్రారంభించినట్లు తెలిపారు. గత ఏడాది కన్నా ఈ విద్యా సంవత్సరం అత్యధికంగా 285 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి బ్రాంచి ప్రిన్సిపాల్ సిఎం.ఉమా, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసరావు, ఎడ్మిన్‌స్ట్రేషన్ ఇన్‌ఛార్జి రాం, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, భారీ సంఖ్యల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News